సాధారణంగా  ఈ రోజుల్లో ప్రతి ఒక ఉద్యోగి భీమ పాలసి కట్టకుండ లేరు.  చాల మంది ఒక పాలసి కాకుండా అనేక పాలసీల తోటి డబ్బును పొదుపు చేస్తున్నామని అనుకొంటారు. కాని అది తప్పు. అంతే కాకుండా దీర్ఘకాలిక ఎండోమెంట్ పాలసీలతోటి తాము ధీమాగా ఉన్నామని అనుకుంటారు. కాని అవసరమైనప్పుడు వారు కట్టిన డబ్బు రావటం లేదని ఆందోళన చెందుతారు.  కేవలం రిస్క్ కల్గినప్పుడే పాలసీ ప్రీమియం చెల్లిస్తారు అన్న విషయం తెల్సినప్పటికి ఈ పాలసీలు తప్ప వేరే పాలసీలు లేవని అనుకుంటారు.  భీమా పాలసీని ఎంచుకొనే టప్పుడు గమనించాల్సిన విషయాలు ఏమిటంటే
1  తీసుకొనే భీమా అనేది తమ ఆదాయానికి తగిన ఉన్నదో లేదో చూసుకోవడం:
 తక్కువ భీమా తీసుకోవడం వల్ల ఒక వేళ పాలసీదారుడుకి మధ్యలో ఏమైనా వచ్చే మొత్తం వారి కుటుంబసభ్యుల జీవనానికి సరిపోయేంత ఉండకపోతే ఆ పాలసీ దేనికి పనికి రాకుండా పోతుంది.  ముఖ్యముగా కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బంది రాకుండా ఉండేటట్లు పాలసీని పాలసీదారుడు ఎంచుకోవాలి.
2  భీమ పాలసీ ఎప్పుడు తీసుకోవాలి?
ఈ ప్రశ్నకు సమాధానం కూడా పాలసిదారుడి దగ్గరే ఉంది. ఎలాంటే ఒక వ్యక్తి తన దగ్గర డబ్బులు మిగిలి నట్లైయితే అతను సినిమాకో లేక వేరే ఏమైనా కొనటానికో ఉపయోగించాలని అనుకుంటాడు. ఇది సర్వసాధారణమే.  ముఖ్యముగా తక్కువ వయస్సులో సంపాదించే వారికి ఈ వ్యాపకం ఉంటుంది. కాని ఈ వయస్సులో ఉన్నవారు భీమా పాలసీలను తక్కువ ప్రీమియంతో పొందవచ్చు. ఎక్కువ మొత్తానికి తక్కువ ప్రీమియం వీరు భీమా పాలసీని వినియోగించుకోవచ్చు.  ఒక వైపు భీమా రక్షణ మరియు మరొకవైపు బోనస్ కూడా తగినంత వస్తుంది.
3  ఎంత మొత్తం భీమా తీసుకోవాలి?
ఈ ప్రశ్న చాల చిక్కు ప్రశ్నే. భీమాను తీసుకునేట్టప్పుడు ముందుగా తమ వార్షిక ఆదాయం ఎంత ఉందొ చూసుకోవాలి. అంతే కాకుండా వార్షిక ఖర్చులను కూడా అంచనా వేసుకోవాలి. తర్వాత వార్షిక ఆదాయానికి 8 రెట్లు లేదా  వార్షిక ఖర్చులకు 20  రెట్లు భీమాను కల్గి ఉండటం ఒక పాలసీదారునికి చాల శ్రేయోస్కరం. 
4  సరియైన భీమాను కల్గి ఉండకపోతే ఏం చెయ్యాలి?
ఇప్పటికే  తక్కువ భీమా రక్షణ ఉన్నప్పుడు తర్వాత తక్కువ మొత్తముతో ఎక్కువ భీమా రక్షణ పొందేటట్లు టర్మ్ పాలసీలను ఎంచుకోవడం మంచిది.  ఈ టర్మ్ పాలసీలలో ఆన్ లైన్ పాలసీల వల్ల ప్రీమియంలో రాయితీ కూడా లభిస్తుంది.  ఈ టర్మ్ పాలసీలే కాకుండా వీటితో పాటు రైడర్లను ఎంచుకోవచ్చు. అయితే భీమా కంపెనీలు క్రిటికల్ రైడర్, ఆక్సిడెన్టల్ డెత్ బెనిఫిట్ రైడర్ కూడా అందిస్తున్నాయి.  అయితే పాలసీని తీసుకొనేటప్పుడు ఈ విషయాలను ఆరా తీయాలి.  కొన్ని టర్మ్ పాలసీలలో అదనపు సౌకర్యాలు కూడా ఉంటాయి. ప్రీమియంలో మార్పు లేకుండా ప్రతి ఐదేళ్ళ కొకసారి పాలసి విలువ కూడా పెరుగుతుంది.  అప్పులకు రక్షణగా తీసుకొనే లోన్ కవర్ టర్మ్ పాలసీలో తగ్గుతున్న రుణ మొత్తానికి అనుగుణంగా పాలసి విలువ తగ్గుతుంది. కొన్ని ఖరీదైన టర్మ్ పాలసీలలో చెల్లించిన ప్రీమియం వెనక్కి వస్తుంది.
ఈ సాధారణ భీమాలే కాకుండా ఆరోగ్య భీమా పతకాలు కూడా భీమా కంపెనీలు ప్రవేశ పెట్టాయి. కొన్ని భయంకరమైన వ్యాధులకు ఈ భీమా మొత్తమును భీమా కంపెని చెల్లిస్తుంది.  ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే చాలా భీమా కంపెనీలు ఇప్పుడు తమ ప్రీమియం ప్రత్యేకతలతో పాలసీదారులను ఆకర్షిస్తున్నాయి. ఒక్కప్పుడు కేవలం
ఎల్ ఐ సి మాత్రమే  ఈ సేవలను అందించేది.


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments