మైక్రోమాక్స్ ట్యాబ్లేట్ ధర 6500 :


ఇటీవల మొబైల్ ఫోన్ల తయారి సంస్థ అయిన మైక్రోమాక్స్ కొత్తగా ట్యాబ్లేట్ పీసీ ని మార్కేట్లోనికి విడుదల చేసింది. ఈ ట్యాబ్లేట్ ను ప్రత్యేకంగా విద్యారంగం కోసం ఫన్ బుక్  పేరిట ఆవిష్కరించింది. దీని ధర సుమారు 6500 రూపాయలు. ఇది ఏడు అంగుళాల ఫన్ బుక్. ఇది ఆండ్రాయిడ్ ఐస్క్రీం శాండ్విచ్ అప్లికేషన్ తో పని చేయడం దీని ప్రత్యేకత.  దీనిలో 1.22 గిగా హెర్ట్జ్ ప్రాసెసర్, 0.3 మెగా పిక్సెల్ విజిఎ ఫ్రంట్ కెమెరా, వైఫై మరియు 4 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఈ ఇంటర్నల్ మెమరీని 32 జీబీ దాక పెంచుకోవచ్చు. అయితే బోధనాంశాల కోసం మైక్రోమక్స్ ఇతర సంస్థలైన పియర్సన్ మరియు ఎవరాన్ వంటి వాటితో ఒప్పందం కుదుర్చుకొంది.  వివిధ తరగతుల కంటెంట్ కోసం కేవలం 799 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని కంపెని సిఈఓ దీపక్ మెహ్ రోత్రా చెప్పారు.

టఫే కంపెనీలో కొత్త ట్రాక్టర్లు:


కొత్త ట్రాక్టరుల కోసం వచ్చే రెండేళ్ళల్లో 180 కోట్ల రూపాయలు వెచ్చిన్చుటకు యోచిస్తున్నామని టఫే చైర్పర్సన్, సిఈఓ మల్లికా శ్రీనివాసన్ అన్నారు. ఈ పెట్టుబడులను కొత్త ప్లాంటుల ఏర్పాటుకు మరియు మదురై, టర్కీలలో ఉన్న ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం పెంచుటకు వినియోగిస్తామని చెప్పారు.  తాము  మార్కెట్లోనికి తెచ్చిన  కొత్త ట్రాక్టర్లు ఎగుమతి డిమాండ్ బాగుందని కూడా ఆమె చెప్పారు. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కేట్టుల్లో కూడా డిమాండ్ బాగా పెరగగలదని అంచనా వేస్తున్నామని ఆమె చెప్పారు.

కోల్ ఇండియా పై రాష్ట్రపతి ఉత్తర్వులు:

విద్యుతుత్పత్తి సంస్థల్లో రాను రాను తగ్గే విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంటే ఇంకొక వైపు కోల్ ఇండియా తాను ఈ సంస్థలతో వివాదాస్పద బొగ్గు ఒప్పందాలను కుదుర్చుకొనని అంతకు ముందే తెలియ జేసింది.  దానికి కేంద్రం అస్త్రం గా రాష్ట్రపతి ఉత్తర్వులు ఇప్పించింది.  ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా వెలువడినవే అని కేంద్రం చెప్పుతుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం కోల్ ఇండియా తప్పకుండ కానిసం 80 % బొగ్గు సరఫరా చేయాలనే నిబంధనతో విద్యుత్ సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకోవలేనని తెలియజేయటం జరిగింది.  ఈ ఉత్తర్వులలో కనీసం 80 % బొగ్గు సరఫరా చేయకపోతే ఎంత జరిమానా చెల్లిన్చవలేనో కోల్ ఇండియా కే వదిలేస్తున్నట్లు తెలియ పరచటం జరిగింది.  ఈ ఉత్తర్వులకు ముందే ప్రధాని కార్యాలయం నుండి ఒప్పందం కుదుర్చుకోవాలని వచ్చిన ఆదేశాలను కోల్ ఇండియా లెక్క చేయలేదు.  దీనితో ప్రభుత్వమునకు పాలుపోక ఈ రాష్ట్రపతి ఉత్తర్వులను ఇప్పించింది.  విద్యుతుత్పత్తి కంపెనీలు ఈ తాజా ఉత్తర్వును స్వాగతిస్తున్నారు.  కాని నిబంధనలలో కోల్ ఇండియా విఫలమైతే కోల్ ఇండియా భారిగా నష్టపోవాల్సి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఈ ఒప్పందం కూడా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఊరట కలిగిస్తున్దనుటలో సందేహం లేదు. కాని ఈ పరిస్థితులలో 50  వేల కోట్ల టర్నోవర్ ఉన్న కోల్ ఇండియా మాత్రం అవసరమైతే ఎంత ఖరీదైన సరే బొగ్గును దిగుమతి చేసుకొని అయినాసరే సరఫరా చేయాల్సి ఉంటుందని ఈ ఉత్తర్వులలో పేర్కొనటం జరిగింది. ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే ప్రస్తుతం భారత్ లో టన్ను బొగ్గు ధర 1600  నుండి 1700  మధ్యలో ఉంది. అంతర్జాతీయ మార్కెటుతో పోల్చుకొంటే ఈ ధర 40  నుంచి 50 శాతం తక్కువ. ఇంకా తేలిక గా  చెప్పాలంటే ఇండోనేసియా నుంచి దిగుమతి చేసుకొనే టన్ను బొగ్గు ధర సుమారు 65 డాలర్లు అనగా 3300 రూపాయలు. దీని బట్టి చూస్తే కోల్ ఇండియా పరిస్థితి ఎలా ఉందొ అర్థం చేసు కోవచ్చునని దానిలో పనిచేసే బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ చెపుతున్నారు.  ఈ ఒప్పందమే కుదుర్చుకుంటే తొందరలోనే కోల్ ఇండియా కంపెని దివాలా తీస్తుందని డైరెక్టర్లు మరియు ప్రైవేట్ ఇన్వెస్టర్లు కూడా ఈ ఒప్పందమును వ్యతిరేకిస్తున్నారు.


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments