క్రొత్త ఆర్ధిక సంవత్సరం మొదలవుతుంటే ఒక ఉద్యోగిలో అనేక ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం ఒక చేత్తో జీతంను ఇచ్చి మరో చేత్తో ఆదాయపు పన్ను రూపంలో మరియు మిగిల్చిన మొత్తాన్ని పరోక్ష పన్నుల ద్వారా తీసుకోవడానికి సిద్ధపడుతుంది. ఈ పి ఎఫ్ రేటు కూడ సవరిమ్పబడి ప్రభుత్వం చేత 8.25 % గా కూడా నిర్ణయింప బండింది. కొన్ని నిబంధనలు కూడా మారాయి. కొన్ని వడ్డీరేట్లు మారుతున్నాయి. ఇవి వ్యక్తి ఆర్ధిక ప్రణాళికల మీద, పొదుపు మరియు మదుపులపై వచ్చే రాబడిపై ప్రభావాన్ని చూపేవే. ఈవన్ని ఎలాఉన్నా ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలోనే మరియు ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి పన్ను ప్రణాళికలు ఎలా ఉండాలో కూడా వ్యక్తి నిర్ణయించుకోవాలి
రాబడి పెరిగింది:

ఈ మధ్య పి పి ఎఫ్ వడ్డీ రేటును సవరించి 8 .8 % గా నిర్ణయించారు. ఇది గత ఆర్ధిక సంవత్సరములో 8 .6  % గా ఉండేది. పి పి ఎఫ్ ఖాతాను భారతీయ పౌరులేవరైనా ప్రారంభించడానికి వీలుంది. దీనిలో ఏడాదికి కనీసం 500 రూపాయలు నుంచి గరిష్టంగా లక్ష వరకు ఇందులో జమ చేయవచ్చును. దీని కాల వ్యవధి 15 ఏళ్ళు. వీలును బట్టి మరొక ఐదేళ్లకు కూడా పొడిగించుకోవచ్చు. చెల్లించిన మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది.
నెలసరి ఆదాయ పతక వడ్డీ రేటును పెంచడం జరిగింది. గతంలో ఇది 8 .20 % గా ఉండేది. ప్రస్తుతం ఈ పథకం మీద వచ్చే వడ్డీ రేటు 8 .50 %. ఐదేళ్ళ కాల వ్యవధి డిపాజిట్లపై వడ్డీని 8 .50 % గా నిర్ణయించడం జరిగింది. సీనియర్ సిటిజన్ సేవింగ్ పథకంలో పెట్టిన పెట్టుబడికి 9 .30 % వడ్డీని నిర్ణయించారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమీ టంటే ఈ వడ్డీని మొత్తం ఆదాయములో కలిపి చూపించాల్సి ఉంటుంది. వర్తించే శ్లాబులను బట్టి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
పాన్ కార్డు అత్యవసరం:
ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా తెరవాలన్న, ఎక్కువ మొత్తాన్ని దాచాలన్న పాన్ కార్డు తప్పనిసరి అవుతుంది. ఇప్పటికీ పాన్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది. దీని కోసం రెండు ఫోటోలు, గుర్తింపు మరియు చిరునామా ధృవీకరణ పత్రాలు ఉంటే చాలు. పాన్ కార్డు దరఖాస్తు కోసం గతంలో 94 రూపాయలు వసూలు చేసేవారు. పెరిగిన సేవాపన్ను వల్ల ఇపుడు పాన్ కార్డు దరఖాస్తు కోసం 96 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాన్ కార్డు దరఖాస్తు కోసం దగ్గరలోని ఎన్ ఎస్ డి ఎల్ యు టి ఐ పాన్ సేవా కేంద్రాలను సంప్రదించాల్సి ఉంటుంది.
చెక్కు వ్యవధి 6 నెలలు కాదు 3 నెలలే:
కొన్నేళ్లుగా బ్యాంకు చెక్కులు, డీడీలు, పే ఆర్డర్లు చెల్లుబాటు వ్యవధి అవి జారీ చేసిన తేది నుండి ఆరునెలలుగా ఉంది. కాని ఏప్రిల్ 1 , 2012 నుండి ఈ నిబంధనలో మార్పు తేబడింది. ఈ చెల్లు బాటు వ్యవధిని 6 నెలల నుండి 3 నెలలకు తగ్గించారు. ఇప్పటి నుండి చెక్కులను, పే ఆర్డర్లను 3 నెలలు కంటే ఎక్కువ కాలం మన దగ్గర ఉంచుతే ఆ చెక్కును నగదుగా మార్చు కోవడం కష్టమౌతుంది.
కొతమంది చెక్కులను నగదుకు ప్రత్యామ్నాయంగా చెలామణి చేస్తూ అప్పులకు హామీగా వాడుతూ దుర్విన్యోగం చేస్తున్నారన్న ఉద్దేశ్యంతో రిజర్వ్ బ్యాంక్ చెల్లుబాటు వ్యవధిని 3 నెలలకు కుదించింది.
ఆర్ధిక పరిస్థితిని సమీక్షించుకోవాలి:
ఇటువంటి తరుణంలో దీర్ఘకాలిక పెట్టుబడి పతకాలను మనం ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మన అవసరాలు మారుతుండడం బట్టి మన ప్రణాళికలను మార్చుకోవాలి. గతంలో ఎవైన పాలసీలు కాలవ్యవధి తీరినవి ఉన్నాయా, గతంలో పన్ను ఆదా కోసం చేసిన పెట్టుబడి పథకాల గురించి సమీక్షించుకొని, వాటి నుండి వచ్చిన నగదును మరల పెట్టుబడిగా పెట్టవచ్చు.
సాధారణంగా భీమా పాలసీలను ఎంచుకొనేటప్పుడు కొందరు దీర్ఘకాలం గురించి ఆలోచించరు. ఎక్కువ మొత్తంలో ఒక నిర్ణీత సమయంలో కట్టవలసి వచ్చినప్పుడు పరిస్థితులు అనుకూలించవు. దీనిని దృష్టిలో ఉంచుకొని పాలసీ ప్రీమియంను నిర్ణయించుకోవాలి.

Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments