ఇప్పటి వరకు ఇంటర్నెట్ కు సంబంధించి గూగుల్ క్రోం, ఫైర్ ఫాక్స్ఎక్స్ ప్లోరర్ మరియు ఒపేరా  వంటి బ్రౌజర్లు ఉన్నాయి.  కాని వీటన్నిటికి భిన్నంగా సరికొత్తగా వచ్చిందే రాక్ మెల్ట్. దీనిని దీని యొక్క రూపకర్తలు వావ్ జర్ అని అంటున్నారు. సోషల్ మీడియాన్ని మరింత సులువుగా ఉపయోగించు కునేందుకు వీలుగా క్రోమీయం ఓపెన్ సోర్స్ దీన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఇది గూగుల్ క్రోం కి  కొత్త వెర్షన్.  అయితే క్రోం లో  ఉన్న ఆప్షన్లతో పాటు దీనిలో అదనంగా సౌకర్యాలను పొందుపరిచారు.
రాక్ మెల్ట్ లోకి లాగిన్ కావాలంటే ముందు ఫేస్ బుక్ లోకి లాగిన్ తప్పకుండా కావాల్సి ఉంటుంది. ఇది ఫేస్ బుక్ ద్వారా ఉపయోగించు కొనే బ్రౌజర్ కాబట్టి ఫేస్ బుక్ ను పూర్తి స్థాయిలో వాడుకొనేటట్లు అనుమతి(allow  ) చేయాలి.   తర్వాత కనపడే విండోలో మనకు విభాగాల వారిగా వెబ్ సర్విస్ లను చూడవచ్చును. వాటిలో కావాల్సిన వాటిని ఎన్నుకొని ఆడ్ అండ్ కంటిన్యు(add  and continue ) క్లిక్ చేయాలి. కనపడుతున్న విండో లోని ఇన్వైట్ అండ్ స్టార్ట్(invite  and  start  ) తో ఫేస్ బుక్ స్నేహితులకు రాక్ మెల్ట్ ఆహ్వానాన్ని పంపవచ్చు.  అప్పుడు సరి కొత్త హొం పేజీతో బ్రౌజర్ సిద్ధమౌతుంది. విండో పైభాగంలో ఫేస్ బుక్ ప్రొఫైల్ ఫోటో, మెసేజ్లు, నోటిఫికేషన్లు మరియు ఫ్రెండ్ల రిక్వెస్ట్ ల ఐకాన్లతో ప్రత్యేక టూల్ బార్ ఉంటుంది. ఫేస్ బుక్ మాదిరిగానే ఇక్కడ అప్ డేట్ సమాచారాన్ని చూడవచ్చు. క్రోం బ్రౌజర్ లో లాగానే ఇక్కడ వెబ్ విహారం చేయవచ్చు.

బ్రౌజింగ్ తారసపడిన ఏదైనా ఆసక్తి కరమైన అంశాన్ని సోషల్ నెట్వర్క్ పంచుకోవాలంటే కొంచెం క్లిష్టకరమైన ప్రక్రియ. ఎందుకంటే వాడుతున్న సోషల్ నెట్వర్క్ లోకి లాగిన్ అయ్యాకనే షేర్ చెయ్యగలం. కాని రాక్ మెల్ట్ లో ఒకే ఒక క్లిక్ తో ఫేస్ బుక్ వాల్ పైన పోస్టింగ్స్ చేయవచ్చు. అంతే కాకుండా ట్యాబ్ విండోలో బ్రౌజింగ్ చేసిన అంశాన్ని అలానే ఉంచి బాణం గుర్తుతో షేర్(share ) ఐకాన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. వెంబడే ఫేస్ బుక్ వాల్ పై పోస్టింగ్ చేసిన అంశం చేరిపోతుంది. అంతే కాకుండా ఫేస్ బుక్ స్టేటస్ మార్చాలంటే అడ్రస్ బార్ ప్రక్కనే కనిపించే న్యూ పోస్ట్(new post ) తో కంపోజ్ చేసి పెట్టుకోవచ్చు.  లింక్స్ ను అటాచ్ చేసే వీలుంది. అంతే కాకుండా బ్రౌజింగ్ ఏదైనా అంశాన్ని తీరిగ్గా చూడాలంటే వ్యూ  లేటర్    అనే ఆప్షన్ తో బ్యాక్ అప్ చేసి పెట్టుకోవచ్చు. ఈ పనిని ట్యాబ్ విండో లో చూడాలనుకునే అంశాన్ని ఓపెన్ చేసి వ్యూ లేటర్ అనే గుర్తుని క్లిక్ చేయాలి. అంతే కాకుండా ఇతర వెబ్సైట్లు, వీడియోలు, చిత్రాలను కూడా వ్యూ లేటర్ లో నమోదు చేసి ఖాళీ సమయంలో చూడొచ్చు.
రాక్ మెల్ట్ లో ట్యాబ్ విండో లో కుడి వైపు సైడ్ బార్ లో ఫేస్ బుక్ స్నేహితుల జాబితా కనిపిస్తుంది. ఒక వైపు బ్రౌజింగ్ చేస్తూనే ఇంకొక వైపు చాటింగ్ చేయవచ్చు. ప్రొఫైల్ ఫోటో పై క్లిక్ చేస్తే చాటింగ్ విండో వస్తుంది. దీన్ని మినిమైజ్ చేసి చాటింగ్ కొనసాగించవచ్చు. మెను లోని సెండ్ మెసేజ్ (send message ) పంపే వీలుంది. ఓపెన్ ప్రొఫైల్ ఇన్ ట్యాబ్(open profile in tab ) తో స్నేహితుల ప్రోఫైల్స్ ని కొత్త ట్యాబులో ఓపెన్ చేయవచ్చు. కుడి వైపు సైడ్ బార్ క్రింది భాగంలోని బాణం గుర్తు ఎక్స్ పాండ్ దిస్ ఎడ్జ్(expand this edge ) క్లిక్ చేస్తే ప్రొఫైల్ ఫోటోలు పేరుతో పాటు కనిపిస్తాయి. దీంట్లోనే ఫైండ్ ఎ  ఫ్రెండ్(find a friend )తో జాబితాలోని స్నేహితులను ఎతకవచ్చు.


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments