ఈ మూడు అక్షరాలు ఉచ్చరిస్తే చాలు మనలో మనకు తెలియని ఒక అద్బుతమైన అనుబుతి కలుగుతుంది. అసలు ఈ ఓమ్ కారం అంటే ఏమిటి దీనిలో ఇంత శక్తీ ఉందోలేదో పరిసిలిద్దాం. 

మన పూర్వికులు ఓమ్ కారానికి ఎంతో ప్రదాన్యత ఇచ్చారు. ఓమ్ నాదంలో వర్తమానం, బుతా, బవిష్యత్తు కాలాలు ఇమిడివున్నవి. ఈ మూడు కాలాలు లో ఉన్న శక్తీ ఈ ఒక్క ఓమ్ కారంలోనే ఉన్నది. ఓమ్ అనేది ఒక పదం కాదు. ఇదొక ఉచ్చారణ. ఓమ్ అనేది ఒక మంత్రం అనుకోవచ్చు లేదా ప్రార్దన అనుకోవచ్చు. ఓమ్ నీ సరైన పద్దతిలో పలికి నట్లయితే శరీరం అంత ప్రతిధ్వనిస్తుంది. ఓమ్ నాదం ఆత్మా లేదా మనసులోకి సూటిగా చొచ్చుకుపోతుంది.

ఉత్తమ ఫలితాలను సాదించటానికి ఓమ్ శబ్దాన్ని లెక్కలేనన్ని ఉచ్చరించవచ్చు. ఓమ్ నాదం ఫలితాలు అద్బుతంగా ఉంటాయి.

ఓమ్ నాదాన్ని పలకటం వల్ల కలిగే ఆరోగ్య ఫలితాలు కొన్ని తెలుసుకుందాం:

మనసు నిర్మలంగా ఉండటానికి  ఎంతగానో దోహదం చేస్తుంది.

బావోద్వేగాలను అదుపుచేస్తుంది.

మనసు కేంద్రీకరణ, జ్ఞాపకశక్తి, అవగాహనా శక్తి మొదలయినవి పెరుగుతాయి.

శారీరకంగా, మానసికంగా,  బావోద్వేగాల పరంగా పూర్తీ విశ్రాంతి లబిస్తుంది.

చుట్టూ వాతావరణం శక్తివంతమయుతుంది.

ఓమ్ నాదాన్ని ఎలాగా పలకాలి.

అయిదు సెకెన్లు పాటు గాడంగా ఉపిరి తీసుకోవాలి.

పెదవులను తెరచి ఉంచి శ్వాస వదులుతూ అ ను రెండు సెకన్లు ఉచ్చరించాలి.

పెదవులను పూర్తిగా ముసి ఉంచి గాలి వదులుతూ ఔ ను మూడు సెకన్లు ఉచ్చరించాలి. 

మొత్తం ఓమ్ నాదాన్ని పుర్తిచేయటానికి 15 సెకన్లు పడుతుంది. ఇది మొదట్లో కష్టంగా ఉంటుంది పోను పోను తేలికగా చేయవచ్చు.

ఓమ్ నాదాన్ని పలికేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి.

ఓమ్ నాదాన్ని ఒక పద్దతి ప్రకారం , సౌకర్యంగా కూర్చొని ఒమ్ నాదాన్ని ఉచ్చరించాలి.  

 


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments