బాదంపప్పు మరియు దాని ఉపయోగం: బాదంపప్పు అనగానే గుర్తుకు వచ్చేది బాదంపాలు. ఎందుకంటే వేసవి కాలం వస్తే చాలు జ్యూసు షాపుల్లో ఎక్కువగా బాదం పాలు అమ్ముడు పోతుంది.  చాల మందిలో బాదంపప్పు మీద అపోహలు ఉన్నాయి.  బాదంపప్పు వాళ్ళ ఊబకాయస్తులు అవుతారని.  కాని  రోజు తినే ఆహారంలో 5 నుంచి 20 వరకు బాదంపప్పులు తీసుకోనుటవల్ల   శరీరానికి కావాల్సిన పోషక పదార్దాలగు విటమిన్-ఇ, మెగ్నీషియం, మాంగనీస్, పొటాసియం వంటి ఎన్నో మూలకాలు లభిస్తాయి.  వంద గ్రాముల బాదం గింజల్లో 578 క్యాలరీల శక్తి ఉంటుంది. బాదంపప్పులో(578 క్యాలరీలలో ) 20 గ్రాముల పిండి పదార్ధాలు, 22 గ్రాముల    ప్రోటీనులు, 51 గ్రాముల క్రొవ్వులు ఉంటాయి. బాదంలో ఫోలిక్ ఆమ్లం ఉండటం వల్ల  పుట్టే పిల్లలో ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి. క్యాన్సర్, దయాబటిస్, అల్జీమర్సు వంటి వ్యాధులు రాకుండా బాదం పప్పులు దోహద పడతాయి.  బాడంపప్పులోని పొటాసియం  బీపిని తగ్గిస్తుంది.  బాదం పప్పులోని రకాలు: బాదంలో తియ్యగా మరియు వగరుగా ఉండేవి అనే రెండు రకాలు ఉన్నాయి. మార్కోన బాదం అనేది పొట్టిగా, గుండ్రముగా మరియు తియ్యగా ఉంటుంది. తియ్యగా ఉండే వాటిని తినటానికి మరియు వగరుగా ఉండే వాటిని సౌందర్య సాధనాలలో వాడతారు. తియ్యని బాడంపప్పును పచ్చిగాను లేదా వేయించి గాని తింటారు.  స్వీట్స్ లో , కేకుల్లో, ఐస్ క్రీముల్లో మరియు ఇతర వంటకాలలో తీయని బాడంపప్పును వాడతారు. బాదం పప్పు సౌందర్య సాధనం ఎట్లా ? బాదం పప్పులో ఉండే ఒలియం ఏమిగ్దాలే అనే నూనె చర్మానికి ఎంతో మంచిది. దీని వల్ల చర్మం మీద ఉన్న నల్లని మచ్చలు తొలగి పోతాయి.  పసిపిల్లలకు బాదం నూనెతో మర్దన చేస్తే వారి శరీరం మృదువుగా తయారవుతుంది. ఈ నూననే తలకి పట్టిస్తే వెంట్రుకలు వత్తుగా పెరుగుతాయి. బాదం పప్పు ఎలా తినాలి? బాదం తొక్కలో జీర్ణం కాని హానికరమైన ట్యానిన్లు ఉంటాయి. కావున నానబెట్టి తింటే మంచిది. కొంతవరకు బాదం పప్పు నానిన తర్వాత నీళ్ళు తీసివేసి మరల 12  గంటల వరకు నానబెట్టిన తర్వాత తిన్నట్లయితే త్వరగా జీర్నమౌతుంది.  ఒక బాదంపప్పులో సుమారు 7 క్యాలోరీల శక్తి దాగిఉంది.

Like it on Facebook, +1 on Google, Tweet it or share this article on other bookmarking websites.

Comments (0)

There are no comments posted here yet