సాధారణంగా కొవ్వు ను తగ్గించుకునేందుకు మనం చాలా పడుతుంటం. చెడ్డ కొవ్వు వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దీనిలో ముక్యంగా గుండె జబ్బులు, డయాబెటీస్ మొదలగు రోగాలు వస్తాయి. మన శరీరంలో కొవ్వు పెరగటానికి కారణాలు చాలా ఉన్నాయ్ వాటిలో ముక్యంగా  హార్మోన్ల అసమతుల్యత, మద్యం తీసుకోవడం, ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి. ఎవరైతే ఎక్కువగా   ఒత్తిడికి గురి అవుతారో వాళ్ళలో కార్టిసాల్‌ అనే హార్మోన్‌ విడుదల అవుతది. కొన్ని ఆహారాలతో మనం శరీరంలోని కొవ్వును తగిన్చుకోవచ్చు.

పసుపు:

 పసుపు వాడితే గుండెకు మంచిది ఈది ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. పసుపు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టనీయదు దీని వల్ల గుండెపోటు నుండి కాపాడుతుంది. 

యాలుకలు:

 ఆహారం సాఫీగా జీర్ణం చేస్తాయి. ఇంకా ఇవి శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కూడా కరిగిస్తాయి.

 మిర్చి :

 మీరాప కాయలో క్యాప్‌సైసిన్ అనే పదార్దం ఉంటుంది ఈది క్యాలరీలను వేగంగా ఖర్చుచేస్తుంది. ఇది        తిన్న 2o నిమిషాలలో తిన్న ఆహారం మీద ప్రబావం చూపిస్తుంది. 

 కరివేపాకు:

 కరివేపాకు ను ఎవరైతే ఉదయం 10 ఆకులూ తింటారో వల్ల శరీరంలో చెడు కొవ్వు ఉండదు. లేదంటే  రసం లాగా తాగొచ్చు. దీనికి చెడు కొవ్వు కరిగించే గుణం ఉంది.

 వెల్లుల్లి

 ఇందులో యాంటీ బాక్టీరియల్ యాసిడ్స్ ఉన్నాయి ఇవి చెడు కొవ్వుని బాగా తగ్గిస్తాయి. చెడు కొవ్వుని కరిగించాతంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. రక్త పోటును కూడా నియంత్రణలో ఉంచుతాయి.

 ఆలివ్ ఆయిల్‌:

 ఏది ఆరోగ్యానికి చాలా మంచిది కానీ దీని వీలువ చాలా ఎక్కువ. పొట్ట తగ్గేందుకు ఇది చాలా ఉపయోగ పడతది. దీనిలో చాలా తక్కువ కొలెస్ట్రాల్ ఉంటది. ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. 

 క్యాబేజీ:

బరువును తగ్గించేందుకు క్యాబేజీ బాగా పనిచేస్తుంది. దేనిని నిత్యం  తింటుంటే కొలెస్ట్రాల్ తగ్గుతూ వస్తది. 

 పెసరపప్పు:

ఇందులో కాల్షియం, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఇంకా విటమిన్ ఎ, బి, సి, ఇ, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా లబిస్తాయి. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి.

తేనె:

ఒబేసిటీని తగ్గించటంలో తేనేను ఎక్కువగా వాడుతుంటారు. రోజూ ఉదయం పూట వేడి నీళ్లలో పది చుక్కల తేనె మరియు లెమన్ రసం కలుపుకొని తాగితే మంచిది.

మజ్జిగ:

 వెన్న తీసిన మజ్జిగను త్రాగితే  బరువు కూడా తగ్గవచ్చు. పాలతో పోల్చుకుంటే మజ్జిగ లో కొవ్వు శాతం తక్కువ.

సజ్జలు:

సజ్జలు అత్యధిక ఫైబర్ ఉంటుంది. సజ్జలతో చేసిన రొట్టెలు  తింటే తక్కువ కొలెస్ట్రాల్‌తోపాటు ఫైబర్ కూడా అందుతుంది. 

చెక్కా లవంగాలు:

ఈ రెండూ లేకుండా మన బారతీయ వంటలు ఉండవు. వీటిలో ఔషధ గుణాలు  ఎక్కువ కబ్బతి ఇవి డయాబెటీస్ మరియు  కొలెస్ట్రాల్‌ల సమస్యలు రాకుండా చేస్తాయి. 

కొత్తిమీర:

కొత్తిమీర రసాన్ని అన్నం తిన్న తర్వాత కొద్దిగా త్రాగితే మంచి జేర్నోపకరిగా పనిచేస్తుంది. 


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments