మనం ఇపుడు నల్లి చాప్ కా పలావ్ అనే వంటకం గురించి చెప్పుకుంటునం.

కావాల్సిన పదార్దాలు:

మటన్ : 1 కిలో

బాస్మతీరైస్: అరకిలో

ఘరంమసాలా: అర చెంచ

కారం: ఒక స్పూను

ఉప్పు: తగినంత

ఉల్లిపాయలు: అరకిలో

నెయ్యీ: 200 గ్రాములు

పచ్చీమిర్చి: 10

అల్లంవెల్లులి: 2 స్పూన్స్

టొమాటో: 2

పసుపు: అర చెంచ

ధనీయాలపోడి: అర చెంచ

జిలకరపోడి: అర చెంచ

కుంకుమ పూవ్వు: ఒక స్పూను

కొత్తిమీర తురుము: 2 స్పూన్స్

అల్లంముక్కలు: ఒక స్పూను

పుదినా తురుము: ఒక స్పూను

వెన్న: 2 స్పూన్స్

మీగడ : 4 స్పూన్స్

గోరువెచ్చని పాలు: అరలిటర్

నిమ్మకాయ: 1

తయారు చేయు విదానం

  • మటన్ ముక్కలను ముందుగా శుబ్రంగా కడుగుకోవాలి.
  • బాస్మతీరైస్ ను కడిగి నానబెట్టాలి.
  • ఉల్లిపాయల పైన ఉన్న పొట్టును తీసివేసి సన్నగా పొడవుగా వాటిని తరుగుకోవాలి.
  • ఇప్పుడు పచ్చిమిర్చినీ తీసుకొని సన్నగా పొడవుగా చీల్చి ఉంచాలి.
  • ఇప్పుడు మీగత పచ్చిమిర్చినీ, అల్లంముక్కలు మరియు కొత్తిమీర తురుము మెత్తగా రుబ్బుకోవాలి .
  • కుంకుమ పూవ్వును గోరువెచ్చని పాలులో వేసుకొని కొంచం సేపు నాననీవాలి.
  • ఇప్పుడు మందపాటి వెడల్పుగా ఉన్న బాండీనీ తీసుకోవాలి.
  • ఇప్పుడు అందులో నెయ్యీ వేసి కాగనీయాలి.
  • ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కలు వేసి బాగా వేయుంచుకోవాలి.
  • అవి వేగిన తర్వాత అందులో పచ్చి మిర్చి, అల్లం, కొత్తిమీర కలిపి నూరిన ముద్దను వేయాలి.
  • తర్వాత ఇందులో అల్లంవెల్లులి ముద్ద, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, దనియాల పోడి ఇవన్ని ఇందులో వేసుకొని బాగా కలియబెట్టాలి.
  • ఇప్పుడు అన్ని బాగా వేగిన తర్వాత కొంచం నీరు పోసుకొని మసాలా ముద్దలా ఉడికించాలి.
  • ఇప్పుడు ఇందులో తరిగిన టొమాటోలు వేసుకోవాలి.
  • ఇప్పుడు ఇందులో ఉప్పు గరం మసాలా వేసి బాగా వేయించాలి.
  • ఇది బాగా వేగిన తర్వాత మటన్ ముక్కలు వేసి కొంచం ఉడికేంతవరకు మూతపెట్టి ఉంచాలి.
  • ముక్కలు మెత్తబటిన తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసం కలిపి దించుకోవాలి.
  • వీడిగా మరో గిన్నెలో సరిపడా నీరు పోసుకొని వాటిని బాగా మరిగించాలి.
  • తర్వాత ఇందులో కడిగి ఉంచిన బాస్మతీరైస్ వేసి ఉడికించాలి.
  • అన్నం సగం ఉడికిన తర్వాత దించి నీరు వంపేయాలి.
  • ఇప్పుడు ఆ అన్నాన్ని మటన్ ముక్కలు మీద వేసి కుంకుమ పూవ్వు కలిపిన పాలు, మీగడ, వెన్న, గరం మసాలా, పొదిన తురుము, చీల్చిన పచ్చీమిర్చి వేసి మూతపెట్టాలి.
  • తర్వాత సిమ్ లో సుమారు 25 నిమిషాలు దమ్ చేయాలి.
ఇంకా ఇప్పుడు దీనిని పోయిమీద నుంచి దించుకొని సర్వు చేసుకోవాలి.

Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments