1 . మడమ నొప్పి:


      సాధారణముగా కొందరు ఉదయం లేవగానే మడమ నొప్పితో విల విల్లాడిపోతారు. అటూ ఇటూ తిరగాగానే కొంత మడమ నొప్పి తగ్గగానే దాని గురించి పట్టించుకోవడం మానేస్తారు.  ఈ మడమ నొప్పి రావటానికి గల కారణం తెలుసుకోన్నట్లయితే ఎలా దీనిని నివారించావచ్చో మనకు అవగతమౌతుంది. మడమ నొప్పి రావటానికి చాల కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యముగా ఇది రావటానికి గల కారణం ప్లాంటర్ ఫేషియైటిస్. మన అరికాలు చర్మం క్రింద, మడమ దగ్గరినుంచి కాలి బొటన వ్రేలు మూలం వరకు ప్లాంటర్ ఫేషియా అనే కణజాలం విస్తరించి ఉంటుంది.  ఎప్పుడైనా, ఎకారనముతోనైనా ఈ కణజాలం చినిగిపోయినా లేదా సాగిన ఇది వాచిపోతుంది.  అప్పుడు అక్కడ మంట, నొప్పి వంటి లక్షణాలు కన్పిస్తాయి.  ఎక్కువగా నిలబడడం వల్ల, అధిక బరువు మోయటం వల్లగట్టిగా వుండే బూట్లు మరియు చెప్పులు వేసుకోవటం వల్ల మడమ నొప్పి వస్తుంది. ప్లాంటర్ ఫేషియైటిస్ వల్ల బాధపడే వారిలో వారి మడమ వద్ద వుండే ఎముక బయటకు పెరగటం వల్ల కూడా మడమ నొప్పి వస్తుంది.  మడమ నొప్పికి కేవలం ఫేషియైటిస్ యే కాకుండా మధుమేహం, రక్తనాళాల జబ్బుల వల్ల కూడా కారణం కావచ్చు. కీల్లవాతం, తీవ్రమైన దెబ్బ తగలడం, కణితులు మరియు ఇన్ఫెక్షన్ వల్ల కూడా మడమ నొప్పి వస్తుంది.

మడమ నొప్పి లక్షణాలు:


ముఖ్యముగా ఈ మడమ నొప్పి ఉదయం నిద్ర లేవగానే లేదా చాలా సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి వ్యాయామం చేసిన తర్వాత కూడ ఈ మడమ నొప్పి వస్తుంది.

చికిత్స:


1 . విశ్రాంతి తీసుకోవడం.
2 . అధికబరువు తగ్గించుకోవడం.
3 . నొప్పి ఉన్నచోట మంచు గడ్డలు ఉంచడం.
4 . మడమ నుంచి పైకి వెళ్ళే కండరాలు సాగేల తేలికపాటి వ్యాయామం చేయడం.
5 . అయిబ్రూప్రోఫెన్ వంటి మందులు డాక్టరు సలహాతో వాడడం.
6 . ఒకవేళ ఏ చికిత్సలు పని చేయకపోతే ఆపరేషన్ చేయవలసి రావచ్చు


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments