మెగ్నీషియం వల్ల లాభం:


సాధారణముగా మన శరీరములో దండిగా ఉండే ఖనిజాలలో మెగ్నీషియం ఒకటి. ఇది సుమారు 300  రకాల జీవ రసాయనిక చర్యలలో పాలు పంచుకుంటుంది. మన శరీరములో మెగ్నీషియం గరిష్టముగా ఎముకలలో ఉంటుంది. మిగితాది కణాల లోపల,  కణజాలంలో మరియు అవయవాలలో ఉంటుంది. ఈ మెగ్నీషియం  కండరాల మరియు నాడుల పని తీరు సక్రమంగా ఉండేటట్లు చూస్తుంది.  మెగ్నీషియం సమృద్దిగా ఉండే ఆహారము తినే వారిలో రక్త నాణాలలో రక్తం గడ్డ కట్టడం ద్వారా వచ్చే పక్షవాత ముప్పు చాలా తక్కువగా ఉంటుందని పరిశోధనల ద్వారా తేలింది.  మనం తినే ఆహారములో 100 మిల్లిగ్రాముల మోతాదు పెరుగుతున్నకొలది పక్షవాత ముప్పు 9 % తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు.  ఈ మెగ్నీషియం ఎక్కువగా పొట్టు తీయని ధాన్యాలు, పాలకూర, తోటకూర లాటి ఆకుకూరలు, చిక్కుడు జాతి కూరలు, బాదాం మరియు జీడిపప్పులో ఉంటుంది.  ఈ మెగ్నీషియం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా చూసుకోవచ్చు.

నీరు వల్ల లాభం:


సాధారణముగా నీరు త్రాగాపోవడాన్ని ఏదో గొప్పగా భావిస్తారు. కాని నీరు తరచుగా అనగా దాహం వేసి నప్పుడు త్రాగకపోతే  డీహైడ్రేషన్ వల్ల మనిషి మూడు మారిపోయి ఏకాగ్రత లోపించడం,  అలసట మరియు తలనొప్పి వస్తుందని తాజా అధ్యయనాల ద్వారా తేలింది. ముఖ్యముగా స్త్రీలు ఈ సమస్యను ఎదురుకున్టారని పరిశోధకులు తెలియజేస్తున్నారు.  సాధారణముగా మనకు దప్పిక వేస్తున్నదంటే మన శరీరములో నీటి శాతం తగ్గిపోయిందని గుర్తించాలి.  తలనొప్పి మరియు అలసట ఉన్నదంటే ఎక్కువ నీళ్ళు త్రాగాలని అర్థం.  ముఖ్యముగా ఇంటి పనులలో ఉండే ఆడవారు మరియు వ్యాయామాలు చేసే ఆడ వారు తరుచుగా నీళ్ళు త్రాగడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చు.


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments