సాధారనముగా అందరు నునుపైన శరీరాన్ని కోరుకుంటారు. దాని కోసం ఎన్నో ప్రయత్నములు చేస్తారు.  కాని ఈ నునుపైన చర్మం కూడా ప్రమాదకరమే.  ఎందుకంటే లైకేన్ ప్లానస్ అనే చర్మ వ్యాధి వచ్చిన్నట్లయితే చర్మం మీద నున్నటి మచ్చలు ఏర్పడతాయి.  ఈ వ్యాధి వల్ల ఎక్కడైతే చర్మం మీద నునుపుగా మారుతుందో అచ్చట వెంట్రుకలు మొలవవు.  ఈ వ్యాధి చర్మం మీదనే కాకుండా నోరు, ఇతర భాగాలలో కూడా మృదువైన పొరలలో వస్తుంది.  కాని జనాలలో ఈ వ్యాధి పైన అంతగా అవగాహన లేదు.  ఈ వ్యాధి వల్ల వెంట్రుకల మొదల్లో దురద వస్తుంది.  ఈ వ్యాధి వచ్చిన్నప్పుడు శరీరంపై ఉదారంగు మచ్చలు నునుపుగా ఉంటాయి.  ఇవి చిన్న బొడిపెల్ల మెరుస్తూ ఉంటాయి. అయితే ఈ లైకేన్ అనే పదం గ్రీక్ భాషకు చెందింది. దీని అర్థం రాళ్ళు లేదా చెట్ల బెరడుల మీద పెరిగే మొక్క.  ప్లానస్ అంటే నునుపుగా ఉండేది అని అర్థం.  ఈ వ్యాధి చాల మందిలో వంశ పార్యంపరంగా వస్తుంది.  మన దేశములో సుమారుగా 0.3 % మంది ఈ వ్యాధితో బాధపడుతున్న వారే. ఈ సమస్య ముఖ్యముగా 20  నుంచి 60  ఏళ్ళ మధ్యలో ఉన్న వారులో ఎక్కువగా ఉందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. పిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువే. సుమారు 4 % పిల్లలు మన దేశములో ఈ సమస్య బాధపడుతున్న వారే.

లైకేన్ ప్లానస్ వ్యాధి కారణాలు:


ఈ వ్యాధి రావడానికి మూల కారణాలు క్రింది విధముగా ఉన్నవి.
1  వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం
2  హెపటైటిస్ సి రకం కామెర్లు రావడం
3  హెపటైటిస్ బి వాక్సిన్ రెండో సారి తీసుకున్న వారిలో ఈ వ్యాధి లక్షణాలు కనపడటం
4  కాలయానికి సిర్రోసిస్ రావడం
5  ఆర్సినిక్, బిస్మత్ మరియు బంగారం లాంటివి ఉపయోగించి చేసే మందులను వాడటం
6  కొన్ని రకాల రసాయనాలకు ఎకస్పోజ్ కావడం
7  క్వినడైన్ గ్లూకమేట్ మరియు క్వినడైన్ సల్ఫేట్ వంటి మందులను చాల కాలం వాడటం
8  మలేరియా కోసం వాడే మందుల సైడ్ ఎఫెక్ట్

లైకేన్ ప్లానస్ లోని రకాలు:


1 లీనియర్ లైకేన్ ప్లానస్: ఈ రకం వ్యాధి వల్ల చర్మం పై పగుళ్ళు వరుస గీతల్ల ఉంటాయి. ఈ రకం ముఖ్యముగా చిన్న పిల్లలో ఎక్కువగా వస్తుంది.
ఆన్యులర్ లైకేన్ ప్లానస్:  ఈ రకం వ్యాధి ఎక్కువగా పురుషులలో వస్తుంది. ఈ రకం వచ్చిన్నప్పుడు భుజాల క్రింద మరియు మర్మావయాల భాగాలలో ఉంగరాలాగుండే పగుళ్ళు వస్తాయి. కొన్ని సార్లు ఈ రకం వ్యాధి బయటకు కన్పించక పోవచ్చు.
హైపర్ ట్రోఫిక్ లైకేన్ ప్లానస్: ఈ రకం వ్యాధి వల్ల చర్మం దళసరిగా మారి విపరీత మైన దురద వస్తుంది. ఇది దీర్ఘకాలిక  సమస్య. కాని దీని చికిత్స కష్టతరం.
అల్సరేటివ్ లైకేన్ ప్లానస్:  ఈ రకం ఎక్కువగా నోటి లోపల వస్తుంది. అంతే కాకుండా  పాదాలు మరియు కాలి వేళ్ళపై  పగుళ్ళ కన్పిస్తుంది. ఒక్కొక్కసారి కాలి బ్రొటన వ్రేలు శాశ్వతంగా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.
ఓరల్ లైకేన్ ప్లానస్: ఈ రకం వ్యాధి సుమారు 15 % శాతం కేసుల్లో కనపడుతుంది. ఈ రకం ముఖ్యముగా పొగాకు నమిలే వారిలో ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పొగాకు వినియోగించే చోట ఈ రకం వ్యాధి ఎక్కువ. చాలా అరుదుగా ఈ రకం వ్యాధి నోటి నుండి గొంతు మరియు కడుపులోనికి వ్యాపిస్తుంది.
యాక్టినిక్ లైకేన్ ప్లానస్: ఈ రకం వ్యాధి దుస్తులు కప్పని భాగంలో పగుళ్ళు గా కన్పిస్తుంది. సాధారణంగా ఈ వ్యాధిని కాన్సర్ గా పొరబడే అవకాశం ఉంది.  ఈ వ్యాధి వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఈ రకం వ్యాధి కన్పిస్తుంది.


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments