ఇంతగా సంచలనం సృష్టించిన 2 జీ స్పెక్ట్రం స్కాముకు సంబంధించి తెలుసుకోనేముందు అసలు స్పెక్ట్రం అంటే ఏమిటో తెలుసుకోవాలి.

స్పెక్ట్రం:


సాధారణంగా విద్యుత్ అయస్కాంత తరంగాల క్షేత్రాన్ని స్పెక్ట్రం గా వ్యవహరిస్తాము. ఇది వైర్లెస్ ప్రసారాలను మోసుకెలుతుంది. ఈ వనరు ఎప్పటికి తరిగిపోదు. కాని టెలికం రంగంలో ఇది అత్యంత విలువైన పరిమితమైన వనరు. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్  దేశాల వారిగా దీని యొక్క ఫ్రీక్వెంసిని కేటాయిస్తుంది.  భారత దేశానికి 9 కిలో హెర్ట్జ్ ల నుండి 400  గిగా హెర్ట్జ్ ల వరకు రేడియో ఫ్రీక్వెంసి అందుబాటులో ఉంటాయి. 

స్పెక్ట్రం అనేది జాతీయ సంపద కావున కేంద్ర ప్రభుత్వం వీటిని సెల్ ఫోను ఆపరేటర్లకు మరియు కమ్యూనికేషన్ పరిశ్రమలోని ఇతరుల కోసం కేటాయిస్తుంది.  కాని రెండవ తరం సెల్ ఫోన్ సేవల కోసం స్పెక్ట్రం 2 జీ ను కేటాయించడానికి తీసుకున్న నిర్ణయాలు వివాస్పద మయినాయి.  ఇప్పటి వరకు ఇంత పెద్ద కుంబకోణం భారత దేశములో జరగలేదు. 2 జీ స్పెక్ట్రంను కొన్ని కంపనీలకు దక్కేలా చేయడానికి అప్పట్లో టెలికం మంత్రి రాజా అనేక అక్రమాలు చేశారన్న వదంతులు కూడా వెలువడ్డాయి.  2007 లోనే కేంద్ర ప్రభుత్వం 2 జీ స్పెక్ట్రం కేటాయింపుకు సంబంధించి నిర్ణయం తీసుకొని ఆ ఏడాదిలో అక్టోబర్ 1 ని గడువుగా మొదట నిర్ణయించింది. అయితే ఆ గడువును కూడా 5 రోజులు ముందుకు జరిపి అనగా సెప్టెంబర్ 25  లోపు అందిన దరఖాస్తులును మాత్రమే ఆమోదించడం జరిగిందని టెలికాం కంపనీలను అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యములో ముంచింది.  ఈ కేటాయింపుల విషయములో 2001  నాటి ధరలను పరిగణలోకి తీసుకోవటం జరిగింది. ఇక్కడ టెలికాం శాఖ విస్మరించిన విషయమేమిటంటే 2001 లో మొబైల్ వినియోగదారులు 40 లక్షల మంది ఉంటే 2008  నాటికి వీరి సంఖ్య 30 కోట్లకు చేరింది. ఇక్కడ విస్మయపరిచే విషయమేమిటంటే వేలానికి వెళ్ళకుండా మొదట వచ్చిన వారికి మొదటి అవకాశం అనే ఉద్దేశముతో కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు జరిపింది.  2008  జనవరి 18  న ప్రవేశ రుసుం మొదట చెల్లించినవారికే మొదటి కేటాయింపు అని కేంద్ర ప్రభుత్వం తమ పద్ధతిని మార్చింది. దీని వల్ల ప్రభుత్వం  భారి ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది.  వచ్చిన 575 దరఖాస్తులలో అర్హత పొందిన కంపనీలు ఒక్కటి కూడా సరియైన ప్రమాణాలను పాటించక పోవడం ఇచ్చట గమనించవలసిన విషయం. నిజానికి ఒక్కో లైసెన్సు విలువ 7442 కోట్ల రూపాయలు ఉండగా 9 కంపనీలు కేవలం 1600 కోట్ల రూపాయలుకు దేశవ్యాప్తముగా పనిచేసే హక్కులను పొందాయి. ఈ కేటాయింపుల విషయమై కేబినేట్ ఆమోద ముద్ర కూడా లేదు. ఆనాటి టెలికాం మంత్రి రాజా కేబినేట్ కమిటి ఆమోదంకు సంబంధించి లెక్క చేయకుండా ఈ కేటాయింపులు జరిపారు.  ముఖ్యముగా రాజా అండదండలు ఉన్నట్లు భావిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలైన స్వాన్ మరియు యూనిటెక్ లు టెలికాం రంగంలో పైసా పెట్టుబడి పెట్టక పాయిన వాటికి రాజా కేటాయింపులు జరిపారని ఆరోపణలు ఉన్నాయి. స్వాన్ సంస్థ 1537 కోట్ల రూపాయలతో హక్కులు పొంది కొద్ది కాలానికే 45 % వాటాను యు ఎ ఈ కి చెందినా ఎటిసలాట్ కు 4500 కోట్ల రూపాయలకు అమ్మింది. యూనిటెక్ సంస్థ 1651 కోట్ల రూపాయలతో లైసెన్సులను పొంది నార్వేకు చెందినా టెలినార్ కు 6120 కోట్ల రూపాయలకు 60 % వాటాను విక్రయించింది.  టెలికాం శాఖ ఈ లైసెన్సులను అమ్మగా వచ్చిన మొత్తం కంటే ఈ రెండు సంస్థలు తమ సగం వాటాను అమ్మగా వచ్చిన సొమ్ము దాదాపు ఇంతే.

లూప్ టెలికాం కు స్పెక్ట్రం కేటాయింపుల్లో అవకతవకలు జరిగినవని అప్పట్లో ఓ స్వచ్చంద సంస్థ కేంద్ర నిఘా సంస్థకు 2009  మే 4 న పిర్యాదు చేయగా, అదే నెలలో స్వాన్ టెలికాం కు లైసెన్సును తప్పు పడుతూ అరుణ్ అగర్వాల్ అను నతడు పిర్యాదు చేశాడు. ఈ విషయాలపై ప్రాధమిక దర్యాప్తు చేసిన సీవీసీ  జరిగిన అవకతవకలు వాస్తవమేనని, ఈ విషయమై దర్యాప్తుకు సిబిఐ ను సూచించింది.  ఈ కేసుపై దర్యాప్తు మొదలు పెట్టిన సిబిఐ మొదట మంత్రి రాజా ఇంటిని మరియు టెలికాం శాఖ కార్యాలయమును కూడా సోదా చేసింది. ఈ కేసులో భాగంగా 2010 నవంబర్ 14  న రాజా తన పదవికి రాజీనామా చేయటంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఆర్.కే చందులియా మరియు టెలికాం మాజీ కార్యదర్శి బెహురాలను సిబిఐ అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి డీఎమ్కే  అధినేత కరుణానిధి కూతురు, రాజ్య సభ సభ్యురాలును కూడా సహకుట్రదారునిగా సిబిఐ అరెస్టు చేసింది. స్పెక్ట్రం కేటాయింపులో అప్పటి మంత్రి రాజా బడా బాబులకు కొమ్ము కాస్తూ భారత ఖజానాకు 1 .76 కోట్ల రూపాయలు నష్ట పరిచారని కాగ్ తన నివేదికలో పేర్కొంది.


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments