పెరగబోతున్న భారత్ రేటింగ్:


భారత్ యొక్క  ఆర్ధిక వృద్ధి రేటు పెరుగుతున్నది. దీనికి సాక్ష్య మేమిటంటే మన ఆర్ధిక శాఖ అధికారులు అంతర్జాతీయ రేటింగ్ ఏజన్సీ స్టాండర్ అండ్ పూర్స్ కు విడమర్చిన వివరాలకు ఎస్ అండ్ పీ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తపరిచిరి. అయితే బీ బీ సి ర్యాంకు ఉన్న దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందన్న విషయాన్ని ఆర్ధిక శాఖ అధికారులు నొక్కివక్కానించడం జరిగింది. అంతకు ముందు 2007 లో 'బీ బీ సి-స్థిరత్వం'గా భారత్ రేటింగ్ ను ఎస్ అండ్ పీ సవరించింది. ఆ రేటింగ్ ప్రకారం అప్పట్లో ఆర్ధిక పరిస్థితులు భారత్లో అధ్వాన్నంగా ఉన్నదని మరియు దేశానికి రుణాల చెల్లింపు సామర్ధ్యం కూడా తగ్గు ముఖం పడుతుందని ఎస్ అండ్ పీ కుండ బద్దలు కొట్టింది. ఆ విషయాన్ని ఎస్ అండ్ పీ ప్రతినిధులు గుర్తు చేయగా, ఆర్ధిక శాఖ అధికారులు ఆదాయాన్ని పెంచేందుకు చేసిన బడ్జెట్ ప్రతిపాదనలను మరియు భారత్ వృద్ధి గమనాన్ని ఆర్ధిక శాఖ అధికారులు వివరించారు.

ఐ టీ రంగంలో పెరుగుతున్న ఉద్యోగాలు:


అంతకు ముందు నత్త నడక ఉన్న ఐ టీ రంగం బలం పున్జుకున్దేమోనన్న సందేహం టీ సి ఎస్, టెక్ మహీంద్ర-సత్యం, ఐగేట్-ప్యాట్ని మరియు ఇతర ఐ టీ కంపెనీల్లో పెరిగిన ఉద్యోగాల సంఖ్యను బట్టి తీరి పోతుంది. ఇందుకు ముఖ్య కారణమేమిటంటే ప్రపంచ ఆర్ధిక పరిస్థితులు నెమ్మదించిన నేపథ్యంలో ఐ టీ సంస్థలు తమకు మంచి అవకాశాలు లభిస్తాయని ఆశించడమే. నాస్కాం ఇటీవల ఈ సారి 2 లక్షల వరకు ఉద్యోగ నియామకాలు ఉండవచ్చునని అంచనా వేసింది. ఐరోపా దేశాలలో ఏర్పడిన ఆర్ధిక క్లిష్ట పరిస్థితుల మూలాన మిగిలి ఉన్న అభివృద్ధి చెందుతూన్న దేశాలలో అనిశ్చిత పరిస్థితి రాజ్యం ఏలుతుంది. ఇటువంటి పరిస్థితులలోను అభివృద్ది చెందుతూన్న దేశాలలో వృద్ధి రేటు ఎక్కువగా ఉండటం వల్ల దేశీయ ఐ టీ కంపెనీలు ఆయా ప్రాంతాలలో నూతన అవకాశాల కోసం వెతుక్కుంటున్నాయి.

ఉద్యోగి ఆరోగ్యమే మహాభాగ్యమని భావిస్తున్న సంస్థలు:


ఆసియా పసిఫిక్ ప్రాంతములో ఉన్న పలు యాజమాన్యాలు ఉద్యోగి ఆరోగ్యంఫై దృష్టి పెడుతున్నాయి. దీనిలో భాగంగా ఆ యాజమాన్యాలు ఉద్యోగి ఆరోగ్యానికి  ప్రాధాన్యత నిచ్చే దిశగా చైతన్య పరుస్తుంది. మెర్సర్ మార్ష్ బెనిఫిట్స్ నిర్వహించిన ఈ సర్వేలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 899 కంపనీల అభిప్రాయాలను సేకరించారు. గత సంవస్తారంలో 314 కంపెనీలు  జీతాల పద్దులో 6 శాతం పైగా ఆరోగ్య పథకాలకు వెచ్చించినట్లు ఈ సర్వే  వెల్లడించింది.  మరో 134 కంపెనీల్లో 10 శాతానికి మించి ఉద్యోగ ఆరోగ్య పరిరక్షణ పథకాలకు ఖర్చు చేస్తున్నట్లు సర్వే వెల్లడించింది. ఉద్యోగులకు ఆరోగ్య సంబంధిత వ్యయం ఈ సంవత్సరంలో మరింతగా పెరగవచ్చును అని సర్వేలో పాలుపంచుకొన్న 59 శాతం కంపెనీల యాజమాన్యం భావిస్తుండటం గమనార్హం.  ఈ అధ్యయనంలో తేలిన విషయమేమిటంటే ఉద్యోగి అస్వస్థత వారి పని తీరుపై ప్రభావం చూపడంతో పాటు కంపెనీ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
పని ఒత్తిడికి నిద్ర లేకపోవడం, ఎక్కువ సేపు కూర్చొని పని చేస్తుండటం, సరైన ఆహారం తీసుకోకపోవడం, పొగ త్రాగే అలవాటు, మితి మీరిన మద్యపానం, వైద్యులు సలహాలు పాటించకపోవడం వంటి ధోరణిలో ఉన్న పలువురు ఉద్యోగులు వాళ్ళు బాధలు పడుతూ యాజమాన్యాలకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కోవడం కోసం పలు కంపెనీలు రానున్న రోజుల్లో వైద్య శిబిరాలను నిర్వహించడం, పని తీరుని మెరుగుపరచుకొనే విధానాన్ని నేర్పడం ద్వారా పని ఒత్తిడిని తగ్గించడం, దీర్ఘకాల వ్యాధులకు కావాల్సిన చికిత్స ప్రాముఖ్యతను తెలియజేయడం వంటి కార్యక్రమాలను నిర్వ్యహిస్తాయన్న విషయం ఆ కంపెనీల ప్రతిస్పందనల ద్వారా తేలిందని సర్వే వల్ల స్పష్టమైనది.  తద్వారా ఆరోగ్యం కోసం ఉద్యోగి తీసుకొనే సెలవులను ఈ కార్యక్రమాల ద్వారా తగ్గించి కంపెనీలు తమ సామర్ధ్యములను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments