అనుకున్నది సాధించడానికి ఒక అమ్మాయి కష్టపడిన ఉదంతమిది. అనంతపురం జిల్లాకు చెందినా పుట్టపర్తిలో నివసిస్తున్న ఒక పేద బాలిక శ్రావణి అను అమ్మాయి తన చదువు కోసం కేరళ రాష్ట్రంలో బిచ్చమేత్తుకుంటూ జీవనం గడిపినతీరు మన కంట నీరు తెప్పిస్తుంది.  ఈ తెలుగు అమ్మాయి తాను టీచర్ కావటం కోసం కేరళ లోని అలప్పుజ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుర బిచ్చమేత్తుకుంటూ సుమారు 2834  రూపాయలు సంపాదించింది.  తాను టీచర్ కావాలంటే వెళ్ళవలసిన టీచర్ ట్రైనింగ్ కోసం కనీసం 24 వేల రూపాయలు కావాల్సి ఉంది. ఆ డబ్బు కోసం జన్గాలప్ప అనే బిచ్చగాడితో కేరళ వెళ్ళింది. ఈమె తండ్రి పేరు నరసింహన్న మరియు తల్లి పేరు రామాన్జినమ్మ. తల్లి అనారోగ్యముతో ఆసుపత్రిలో ఉన్నది. తండ్రి చిన్న కూలి కావటం వాళ్ళ, తన టీచర్ సరిపోయేంత డబ్బు  రాదనీ ఉద్దేశంతో ఈమె కేరళ వెళ్ళింది. తండ్రి కూడా గుండె జబ్బుతో బాధ పడుతున్నాడు. అలప్పుజ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా బిచ్చమడుగుతున్న ఆమెను ఒక ఆటో డ్రైవరు గమనించి ఆమెను కేరళ సంక్షేమ అధికారులకు అప్పగించగా ఆమెను అలప్పుజ మహిళా మందిరానికి  తరలించారు.
ఆమె అక్కడ విలేకరులతో తన కష్టాలు చెప్పుకుంటూ తను మొదట నర్సు కావలెనని అనుకున్నట్టు తర్వాత తన ఎడమ చేయి స్వాధీనములో లేకపోవడం వల్ల, టీచర్ కావలేని అనుకున్నట్లు, దాని కోసం 24 వేల రూపాయలు కావాల్సి ఉండగా ఆ డబ్బు కోసం బిచ్చమేత్తడానికి కేరళ వచ్చానని చెప్పింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరిగే విలేజ్  అసిస్టెంట్ ఆఫీసర్స్ పరీక్షలకు ప్రిపేరు అవుతున్నట్లు చెప్పింది.17 ఏళ్ల శ్రావణి ఇంటరులో 1000  కి 752 మార్కులులతో పాసైంది.


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments