కాఫీ కోసం జీవిత పోరాటం: కాఫీ తోటలంటే ఒక విధమైన అనుభూతి కలగటం సహజం. కాఫీ త్రాగడానికి రుచిగా ఉంటుంది. మరి కాఫీ వెనుక ఉన్న అసలు కష్టం ఎవరిది?  కాఫీ పంటను పండించి మన ముంగిట్లో కాఫీని ఉంచుత్తున్న దేవరు? వారెవరో కాదు అడవి బిడ్డలు. విశాఖ జిల్లాలో మినుములూరు కొండలలోకి వెళితే ఎముకల కొరికే చలిని కూడా లెక్కచేయకుండా కాఫీ పంటను సేకరించే గిరిజన స్త్రీలు చాల మంది కనపడతారు. విశాఖ గిరిసీమలో  ఉన్న ఆర్వి నగరం, చింతపల్లి మరియు మినుములూరులలో సుమారుగా నాలుగువేల హేక్టారులలో కాఫీ ప్లానిటేషణలు ఉన్నాయి. ఇచ్చట పచ్చని కాఫీ మొక్కలను మనము చూడవచ్చును. వీటి నిండా పండ్లు, కాయలు గుత్తులుగుత్తులుగా వ్రేలాడుతూ ఉంటాయి.  కాఫీ మొదళ్ళను చుట్టేసుకొని మిరియాల తీగలు పైపైకి పాకుతూ ఉంటాయి.  అలాంటి కాఫీ తోటల్లో ఎటువంటి చప్పుడు చేయకుండా ఈ గిరిజన స్త్రీలు తమ పని తాము చూసుకుంటారు. వీళ్ళల్లో ఉన్న గొప్పదనము ఏమిటంటే వీరు ఉదయం ఏడింటికి పనిలోకి వెళ్లి సాయంత్రం నాల్గింటి వరకు సుమారుగా కిలోల కొద్ది కాఫీ పండ్లను   ఎరుతుంటారు.  రోజుకు నూరు నుంచి నూట యాభై వరకు కూలి వారికి గిట్టుబాటు అవుతుంది.  సుమారుగా రోజు మొత్తముగా వారు  నలభై నుండి యాభై కిలోల కాఫీ పండ్లను ఏరుతారు.  కాఫీ పండ్లు ఏరే ఒక మహిళ " ఎగుడు దిగుడుగా ఉండే ఈ కాఫీ తోటల్లో చలి కాలంలో నీడలో పెరుగుతున్న కాఫీ పంటను కోయుట మరియు ఈ చలికి తట్టుకొని కాఫీ పండ్లను కోయుట అనేది కత్తి సాము లాంటి వ్యవహారం" అని అన్నది. ఇంకో మహిళ" ఈ పనికి మగాలు పెద్దగా రారు. మా రాబడితోనే ఇల్లు గడిచే పరిస్థితులు ఉంటాయి" అని అన్నది. ఇంకో మహిళ " ఈ చలికి కాఫీ పండ్లు తేమ్పుతుంటే చేతులు కొంకర్లు పోతుంటాయి. అడుగులు ముందుకు పడడం చాలా కష్టం. కొన్ని సందర్భాలలో కోతులు వచ్చి హడావుడి చేస్తున్న వాటిని తట్టుకొని పని చేయాలి. కాఫీ పండ్లను తేమ్పెటప్పుడు చాలా మెలకువ వహించాలి. లేకపోతే ప్రయోజనము ఉండదు." అన్నది. ఈ గిరిజన మహిళలు ఈ కాఫీ పండ్లను ఎరుకోచ్చిన  తర్వాత  వాటిని ఎండబెడతారు.  మెషీనుల సహాయముతో పైన ఉన్న కండను తొలగించి కాఫీ బోర్డుకు పంపిస్తారు. అక్కడ వీటిని వేయిస్తారు.  అక్కడ ఒక మహిళ " విశాఖ ఏజన్సీ కాఫీకి ఇతర దేశాలలో చాలా గిరాకి ఉంది. నెంబర్ వన్ కాఫీ అనేది ఈ విశాఖ నుండే ఉత్పత్తి అవుతున్నందుకు  మాకు గర్వకారణ మవుతుంది." మినుములూరు ఎస్తేటులో సుమారు 400  మంది వరకు స్త్రీలు ఇచ్చట పని చేస్తుంటారు.  నవంబరు నుండి సుమారు మూడు నెలల పాటు కాఫీ పండ్ల సేకరణ చేస్తారు. మిగిలిన కాలమంతా తోటల సంరక్షణ చేస్తారు." అని  తోటలో పని చేసే ఒక మహిళ అన్నది. పాడేరు మండలం మినుములూరు ప్రాంతములో ఉండే మహిళలలో చాలా మంది ఈ కాఫీ పండ్ల సేకరణలో తమ జీవితాలను గడుపుతారు.  ఎవరికైనా ఆరోగ్యం దెబ్బతింటే వారి బదులు వేరొకరు పని చేస్తారు.  మరియు పండ్లు ఏరి వారి ఖాతాలో రాయిస్తారు. పండుగలు వస్తే అందరు కలసికట్టుగా ఆ ఆనందమును పంచుకుంటారు

Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments